హూవర్ డ్యామ్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడ తాజాగా నెవాడా, అరిజోనా రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఉన్న హూవర్ డ్యామ్ ను సందర్శించారు.
అమెరికా పర్యటనలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాస్ వెగాస్‌లోని ఐకానిక్ హూవర్ డ్యామ్‌ను సందర్శించారు. నెవాడ, అరిజోనా రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఉన్న హూవర్ డ్యామ్‌ను డిప్యూటీ సీఎం బృందం పరిశీలించారు. ఫెడరల్ ప్రభుత్వ అధికారి నేతత్వంలో ఈ సందర్శన కొనసాగుతుంది. డ్యామ్ లో నీటి నిర్వహణ, కరెంట్ ఉత్పత్తి యంత్రాంగం, నిర్మాణ వ్యవస్థ, భద్రతా చర్యలను డిప్యూటీ సీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా డ్యామ్ నిర్మాణ చరితను భట్టి తెలుసుకున్నారు.
తెలంగాణలోని జల విద్యుత్ ప్రాజెక్టులను మెరుగుపరచడానికి హూవర్ డ్యామ్ వద్ద అనుసరిస్తున్న మెరుగైన విధానాలను మన రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వర్తింపజేస్తామన్నారు. లాస్ వెగాస్‌లో మైనింగ్ ఎగ్జిబిషన్‌లోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. కాగా, మరో వారం రోజుల పాటు అమెరికాలోనే భట్టి పర్యటించనున్నారు.