Telugu Global
Telangana

గ్రేట్ అచీవ్ మెంట్ మోదీజీ.. కేటీఆర్ పంచ్

“లెస్ క్యాష్ ఫస్ట్, క్యాష్ లెస్ సొసైటీ నెక్ట్స్..” పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోదీ గర్వంగా చెప్పిన మాటలివి. కానీ ఆయన చెప్పినంత తేలిగ్గా ఆ రెండిటిలో ఏదీ జరలేదు.

గ్రేట్ అచీవ్ మెంట్ మోదీజీ.. కేటీఆర్ పంచ్
X

చెప్పేది కొండంత, చేసేది గోరంత.. మోదీ విషయంలో ఇది నిజమని తేలిపోయిందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. పెద్ద నోట్ల రద్దు అనేది NPA(చేతగాని అలయెన్స్) తీసుకున్న అత్యంత పనికిమాలిన నిర్ణయం అని మరోసారి రుజువైందని వివరించారు. విదేశాల్లో ఉన్న నల్లడబ్బు వెనక్కు రావడం సంగతి అటుంచితే, దేశంలో చెలామణిలో ఉన్న నగదు నోట్ల రద్దు తర్వాత అమాంతం రెట్టింపవడం దారుణం అని చెప్పారు. నోట్ల రద్దుతో ప్రయోజనాలు లేకపోగా.. నగదు పెరిగి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందని అభిప్రాయపడ్డారు. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, భారత్ లో చెలామణిలో ఉన్న నగదుపై పార్లమెంట్ లో ఇచ్చిన జవాబుకి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.


మోదీ ఏం చెప్పారంటే..?

“లెస్ క్యాష్ ఫస్ట్, క్యాష్ లెస్ సొసైటీ నెక్ట్స్..” పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోదీ గర్వంగా చెప్పిన మాటలివి. కానీ ఆయన చెప్పినంత తేలిగ్గా ఆ రెండిటిలో ఏదీ జరలేదు. క్యాష్ లెస్ సొసైటీ అనేది తర్వాతి సంగతి, క్యాష్ మాత్రం పెరిగిపోతోంది. ఆర్థిక వ్యవస్థ పతనానికి ఇదే తొలిమెట్టు అనేది ఆర్థిక నిపుణుల మాట.

నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ సమాధానంలోనే ప్రభుత్వ అసమర్థత, డొల్లతనం కనపడుతోంది. 2014 మార్చిలో భారత్ లో నోట్ల పరిమాణం 7.73 లక్షలు ఉండగా.. 2022 మార్చి నాటికి చలామణిలో ఉన్న నోట్ల సంఖ్య 13.05 లక్షలుగా తేలింది. 2014లో రూ.13 లక్షల కోట్లు ఉన్న నోట్ల విలువ.. 2022 మార్చిలో 31.33 లక్షల కోట్లకు చేరింది. అంటే నోట్ల రద్దు వల్ల ఉపయోగం లేకపోగా.. పెద్ద ఎత్తున నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఇది ఆర్థిక ఇబ్బందులకు పరోక్ష కారణం అని తేలిపోయింది.

నోట్ల రద్దు సమయంలో స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్ల ధనమంతా వెనక్కు వచ్చేస్తుందని మోదీ గొప్పలు చెప్పారు. కానీ ఇప్పుడు భారత్ లో ఉన్న డబ్బు అమాంతం పెరిగిపోతోంది. క్యాష్ లెస్ భారత్ అనేది కలగానే మిగిలిపోయింది. ఈ పరిణామంతో డీమానిటైజేషన్ విఫలప్రయోగం అని తేలిపోయిందన్నారు కేటీఆర్.

First Published:  14 March 2023 12:05 PM IST
Next Story