చెరువులో నిర్మించిన భారీ భవనం కూల్చివేత
మల్కాపురం పెద్దచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఈ భవనాన్ని బాంబులతో నేల మట్టం. శిథిలాలు ఎగిరి పడటంతో ఇద్దరికి గాయాలు
BY Raju Asari26 Sept 2024 11:12 AM IST
X
Raju Asari Updated On: 26 Sept 2024 11:12 AM IST
సంగారెడ్డి జిల్లాలోని కొండపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మధిర గ్రామంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. కొంతమంది వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్థుల భవనం కట్టడంతో ఈ చర్యలు తీసుకున్నారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరి పడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి.
సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి 12 ఏండ్ల కిందట మల్కాపురం పెద్దచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు. నీళ్లలో అడుగుపెట్టకుండా లోపలికి వెళ్లడానికి కొంత దూరం నుంచే మెట్లు కట్టారు. యజమాని కుటుంబసభ్యులు వీకెండ్‌లో ఇక్కడి వచ్చి సేద తీరుతుంటారు.
Next Story