Telugu Global
Telangana

నాగార్జునకు రేవంత్ షాక్‌.. N- కన్వెన్షన్ కూల్చివేత

తమ్మిడికుంట చెరువులో మూడు ఎకరాల 30గుంటలను ఆక్రమించి N-కన్వెన్షన్ సెంటర్‌ నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

నాగార్జునకు రేవంత్ షాక్‌.. N- కన్వెన్షన్ కూల్చివేత
X

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. నగరవ్యాప్తంగా ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా, వాటిని కూల్చివేసే పనిలో హైడ్రా ఉంది. ఇప్పటికే గండిపేట పరిధిలోని ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా అక్కడ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునకు చెందిన N- కన్వెన్షన్ సెంటర్‌ను సైతం హైడ్రా కూల్చేసింది.

ఉదయం ఆరుగంటలకే మాదాపూర్‌ N- కన్వెన్షన్‌ చేరుకున్న హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. తమ్మిడికుంట చెరువులో మూడు ఎకరాల 30గుంటలను ఆక్రమించి N-కన్వెన్షన్ సెంటర్‌ నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. FTL పరిధిలో నిర్మించిన N-కన్వెన్షన్ సెంటర్‌ను తక్షణం కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్‌కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నాగార్జున N-కన్వెన్షన్‌ను కూల్చేశారు హైడ్రా అధికారులు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు

First Published:  24 Aug 2024 4:24 AM GMT
Next Story