పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా
వాదనలు వినిపించడానికి సమయం కావాలని కోరిన అడ్వకేట్ జనరల్. కేసు వచ్చేనెల 4వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు హైకోర్టు నవంబర్ 4కు వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు వినిపించడానికి సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరగా దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్వర్వులను సవాల్ చేస్తూ..అసెంబ్లీ కార్యదర్శి సీజే ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని, సభాపతిని ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని అప్పీల్‌లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ముందు ఉంచి విచారించడానికి తేదీని నిర్ణయించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. అనంతరం విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.
బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతే వేటు వేయాలన్న పిటిషన్లపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. రాజ్యాంగపరమైన ఉన్నత పదవిలో ఉన్నస్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయడానికి కోర్టుకు అవకాశం లేనందున.. అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందు ఉంచాలని ఆదేశించింది. నాలుగు వారాల వ్యవధిలో విచారణ షెడ్యూల్‌ను ప్రకటించాలని స్పష్టం చేసింది. ఆ వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్‌కు నివేదించాలని ఆదేశించింది. ఆ లోగా వివరాలు అందజేయకుంటే మేమే తగిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే వాదనలు వినిపించడానికి అడ్వకేట్ జనరల్ మరికొంత సమయం కావాలని కోరడంతో హైకోర్టు విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.