Telugu Global
Telangana

కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. నేడు నాంపల్లి కోర్టులో విచారణ

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావాపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది.

కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. నేడు నాంపల్లి కోర్టులో విచారణ
X

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా.. నేడు నాంపల్లిలో కోర్టులో విచారణకు రానుంది. శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా జడ్జి లీవ్‌లో ఉండటంతో ఈరోజుకు వాయిదా పడింది. కోర్టు ఎలా స్పందిస్తుందోననే సర్వత్ర ఉతర్కంఠ నెలకొంది. తన ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై హీరో నాగార్జున వేసిన పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రానుంది. సమంత విడాకుల్లో తన ప్రమేయం ఉందంటూ ఆమె చేసిన కామెంట్స్ తమ కుటుంబ పరువుకు భంగం కలిగించాయంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు.

అధారాలు లేకుండా ఇలాంటి కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ టాలీవుడ్ ప్రముఖులు రియాక్ట్‌ అయ్యారు. ఈ విషయంలో నాగార్జునకు చాలామంది సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే చాలామంది సినీ నటులు స్పందించడంతో కొండా సురేఖ స్పందిస్తూ కాస్త వెనక్కు తగినట్టుగా తెలుస్తోంది. అక్కినేని ఫ్యాన్స్ సైతం ఈ విషయాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో కొండా సురేఖ పై ట్రోల్స్ చేస్తున్నారు.ఆమె అక్కినేని కుటుంబానికి క్షమాపణలు తెలపాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

First Published:  7 Oct 2024 10:41 AM IST
Next Story