Telugu Global
Telangana

బెంజ్‌ కారు ఆరోపణలు.. 2 రోజులే డెడ్‌లైన్.. ఆసక్తికరంగా బీజేపీ, కాంగ్రెస్ వార్

త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీ టికెట్‌ ఆశావహుల్లో ఒకరు దీపాదాస్‌ మున్షీకి బెంజ్‌ కార్‌ గిఫ్ట్‌గా ఇచ్చారని NVSS ప్రభాకర్ ఆరోపించారు.

బెంజ్‌ కారు ఆరోపణలు.. 2 రోజులే డెడ్‌లైన్.. ఆసక్తికరంగా బీజేపీ, కాంగ్రెస్ వార్
X

బీజేపీ నేత NVSS ప్రభాకర్‌కు కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ షాక్‌ ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలపై ప్రభాకర్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. కాంగ్రెస్‌ నేతల నుంచి దీపాదాస్‌ మున్షీ బెంజ్‌కారు పొందినట్లు ప్రభాకర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడాన్ని దీపాదాస్ మున్షీ ఖండించారు. ఆరోపణలపై 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని NVSS ప్రభాకర్‌ను హెచ్చరించారు దీపాదాస్ మున్షీ.

త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీ టికెట్‌ ఆశావహుల్లో ఒకరు దీపాదాస్‌ మున్షీకి బెంజ్‌ కార్‌ గిఫ్ట్‌గా ఇచ్చారని NVSS ప్రభాకర్ ఆరోపించారు. దీపాదాస్‌కు బెంజ్‌ కారు కొనివ్వడంపై తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఎంపీ టికెట్‌ కోసం ఆమెకు కారును ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారన్నది మాత్రం ఆయన చెప్పలేదు. అయితే దీపాదాస్‌ మున్షీపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అలాగే మున్షీ దీనిపై స్పందిస్తేనే తాను సమాధానం చెబుతానని, ఆధారాలు చూపిస్తానని NVSS ప్రభాకర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తనపై చేసిన ఆరోపణలపై దీపాదాస్‌ మున్షీ స్పందించారు. NVSS ప్రభాకర్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. లీగల్ నోటీసులపై ప్రభాకర్‌ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  27 Feb 2024 4:36 AM GMT
Next Story