సీఎం రేవంత్ తో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భేటీ
కుల గణనపై సీఎంతో చర్చించిన బూసాని
BY Naveen Kamera5 Nov 2024 1:38 PM IST
X
Naveen Kamera Updated On: 5 Nov 2024 1:38 PM IST
సీఎం రేవంత్ రెడ్డితో డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మంగళవారం బూసాని వెంకటేశ్వర రావు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న కుల గణనపై సీఎంతో చర్చించారు. 1993 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వర రావును ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టబోయే కుల గణన కమిషన్ కు చైర్మన్ గా నియమించింది. ఈ కమిషన్ నెల రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే కుల గణన కోసం ప్రభుత్వం ఎన్యూమరేటర్ల నియామకంతో పాటు ఏర్పాట్లు పూర్తి చేసింది. బీసీ కమిషన్ తోనే కుల గణన చేయించాలని భావించినా అందుకు హైకోర్టు ససేమిరా అనడంతోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది.
Next Story