బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన దాసోజు శ్రవణ్
ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను దాసోజు శ్రవణ్ కుటుంబసమేతంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు
BY Vamshi Kotas11 March 2025 9:50 PM IST

X
Vamshi Kotas Updated On: 11 March 2025 9:50 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ మాజీ సీఎం కేసీఆర్‌ను కుటుంబసమేతంగా కలిశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు అధినేతకు కృతజ్ఞతలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్నరు.విద్యార్థి సంఘం నేతగా రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్.. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పని చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 జులైలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అప్పటి ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే సాంకేతిక కారణాలతో గవర్నర్ తిరస్కరించారు. ప్రస్తుతం మరోసారి కేసీఆర్ ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.నామినేషన్ల విత్‌డ్రాకు 13 వరకు అవకాశం ఉంది. 20న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Next Story