Telugu Global
Telangana

డెయిరీ మిల్క్‌ డేంజర్.. నిర్ధారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ

డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగులు ఉండటంపై సూపర్‌మార్కెట్ నిర్వాహకులను ఆయన ప్రశ్నించారు. గడువు ముగిసిన ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన ప్రశ్నించారు.

డెయిరీ మిల్క్‌ డేంజర్.. నిర్ధారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ
X

చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు?. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అంతా వీటిని ఇష్టంగానే తింటారు. అందులోనూ డెయిరీ మిల్క్‌ చాక్లెట్ అంటే లొట్టలేసుకుంటూ తింటుంటారు. ఎంతో ఇష్టపడి తినే చాక్లెట్లు దీర్ఘకాలంలో అనారోగ్యానికి గురిచేస్తాయని నిపుణులు హెచ్చరించినా పట్టించుకోరు. అయితే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్స్‌పై తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ బిగ్ బాంబ్ పేల్చింది. డెయిరీ మిల్క్‌ చాక్లెట్స్‌ తినడం అసలే మాత్రం సురక్షితం కాదని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది.

ఈ మధ్యే హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో బతికున్న పురుగు కనిపించడం సంచలనంగా మారింది. చిన్న పురుగు చాక్లెట్ రంగులోకి మారి తిరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక కార్యకర్త రాబిన్ జాచ్యూస్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ సూపర్‌మార్కెట్‌లో కొనుగోలు చేశానని, దానికి సంబంధించిన బిల్లును కూడా జత చేశానని చెప్పారు.



డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగులు ఉండటంపై సూపర్‌మార్కెట్ నిర్వాహకులను ఆయన ప్రశ్నించారు. గడువు ముగిసిన ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన ప్రశ్నించారు. డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగు బయటపడ్డ వీడియో తెగ వైరల్ అయింది. ఇంతలోనే డెయిరీ మిల్క్ చాక్లెట్లు తినడం సేఫ్ కాదని తెలంగాణ ఫుడ్ ల్యాబరేటరీ అధికారులు ప్రకటించారు.

First Published:  28 Feb 2024 1:20 PM IST
Next Story