మిచౌంగ్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో వర్షాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లందు, సత్తుపల్లిలో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.
మిచౌంగ్ తుపాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షం కురుస్తోంది. నగరంలోని అమీర్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, మియాపూర్, కూకట్‌పల్లి, మూసాపేట, ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్డుపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లందు, సత్తుపల్లిలో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 90 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో చాలా చోట్ల పంటలకు తీవ్ర నష్టం జరిగింది.