Telugu Global
Telangana

తెలంగాణలో 24 శాతం సైబర్ నేరాలు పెరిగాయి : సీపీ సీవీ ఆనంద్

రాష్ట్రంలో ఈ సంవత్సరం సైబర్ నేరాలు 24 శాతం పెరిగాయని హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

తెలంగాణలో 24 శాతం సైబర్ నేరాలు పెరిగాయి :  సీపీ సీవీ ఆనంద్
X

తెలంగాణలో ఈ సంవత్సరం సైబర్ నేరాలు 24 శాతం పెరిగాయని హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వార్షిక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ మధ్యకాలంలో 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. డిజిటల్‌ అరెస్ట్‌లు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అలాగే36 రకాల సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు.

నేరాల కట్టడిలో తెలంగాణ పోలీసులు చురుగ్గా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు.ఎన్నో సమస్యల మధ్య సైబర్ నేరగాళ్లను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారని గుర్తు చేశారు. సైబర్‌ నేరాల కట్టడి, లేటెస్ట్ సైబర్‌ సెక్యూరిటీ సాధనాలు, సైబర్ నేరాలు ఎలా ఎదుర్కోవాలనేదానిపై చర్చించారు. ఉన్నత విద్యావంతులే నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారని ఆయన తెలిపారు.ఈ ఏడాది 35.8 కోట్లను రికవరీ చేశామని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ బ్రిజేష్ సింగ్, సిఐడి చీఫ్ శిఖా గోయల్ తదితరులు హాజరయ్యారు.

First Published:  6 Nov 2024 4:02 PM IST
Next Story