Telugu Global
Telangana

CWC వేళ ఆశావహుల సందడి.. షర్మిల మాత్రం దూరం

హైదరాబాద్ లో CWC మీటింగ్ సందర్భంగా షర్మిల చేరిక ఉంటుందని అనుకున్నారంతా. కానీ ఆమె మినహా చేరికలకు సిద్ధంగా ఉన్నవారంతా ఈ మీటింగ్ హడావిడిలోనే కండువాలు కప్పేసుకోడానికి రెడీ అయ్యారు.

CWC వేళ ఆశావహుల సందడి.. షర్మిల మాత్రం దూరం
X

హైదరాబాద్ లో కాంగ్రెస్ మూడురోజుల పండగ మొదలవుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కొత్తగా ఎన్నికైన తర్వాత తొలి మీటింగ్ కి హైదరాబాద్ ని వేదిక చేసుకున్నారు నేతలు. తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త ఉత్సాహంతో ఇక్కడకు వస్తున్నారు. ఈ సందర్భంగా చేరికల పర్వం కూడా మొదలు కాబోతోంది. తుమ్మల, జిట్టా, యెన్నం.. లాంటి నేతలు కాంగ్రెస్ కండువాలు రెడీ చేసుకున్నారు, అనుచరులతో సందడి చేయబోతున్నారు. మైనంపల్లి లాంటివారు కూడా సడన్ గా తమ నిర్ణయాలు ప్రకటించి కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటారని సమాచారం. హైదరాబాద్ లో ఇంత హడావిడి జరుగుతున్నా షర్మిల మాత్రం ఈ పెద్ద ఈవెంట్ మిస్సవుతున్నారు. అయితే శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో షర్మిల భేటీ ఆసక్తికరంగా మారింది.


వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో కలపడం గ్యారెంటీ అని తేలిపోయింది. పలు దఫాలు చర్చలు జరిగాయి. రెండు వర్గాలు పూర్తి సంతృప్తితో ఉన్నాయి. కానీ మహూర్తం మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. షర్మిల చేరిక ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉంటుందో తేలడంలేదు. వాస్తవానికి CWC ని మించిన పెద్ద సందడి ఇంకోటి ఉండదు. ఈ సందర్భంగా షర్మిల చేరిక ఉంటుందని అనుకున్నారంతా. కానీ ఆమె మినహా చేరికలకు సిద్ధంగా ఉన్న మిగతా వారంతా ఈ మీటింగ్ హడావిడిలోనే కండువాలు కప్పేసుకోడానికి రెడీ అయ్యారు.

కాంగ్రెస్ లో షర్మిల పాత్ర ఏంటి..?

షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకున్న తర్వాత ఆమెను తెలంగాణకు పరిమితం చేస్తారా, ఏపీలో పార్టీ పటిష్టతకు ఉపయోగించుకుంటారా, ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దింపుతారా, పరోక్ష పద్ధతిలో రాజ్యసభవంటి ఉన్నత పదవి కట్టబెడతారా..? ప్రస్తుతానికి ఇవన్నీ అనుమానాలే. ఒంటరి పోరాటం చేసే బదులు కాంగ్రెస్ లో చేరి ఏదో ఒక పదవితో ఉనికి కాపాడుకోవడం మేలు అని షర్మిల డిసైడ్ అయ్యారు. అస్త్రసన్యాయం చేసి, కాంగ్రెస్ లో కలసిపోతున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో షర్మిల పాత్ర ఏమేరకు అనేదానికి తుదిరూపు రావాల్సి ఉంది. అప్పుడే ఆమె ఎంట్రీ ఖరారవుతుంది.

First Published:  16 Sept 2023 7:36 AM IST
Next Story