Telugu Global
Telangana

మంత్రి పొంగులేటి కుమారుడి ఇంట్లో కస్టమ్స్‌ తనిఖీలు

త‌న కుమారుడి నివాసంలో సోదాల గురించి మంత్రి పొంగులేటిని అడిగితే ఆయన సమాధానం దాటవేశారు. ప్రస్తుతం తాను ఢిల్లీలో ఉన్నానని, పార్టీ పనుల్లో బిజీగా ఉన్నానని సమాధానం చెప్పారు.

మంత్రి పొంగులేటి కుమారుడి ఇంట్లో కస్టమ్స్‌ తనిఖీలు
X

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు పొంగులేటి హర్ష నివాసంలో చెన్నై కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కోటి రూపాయలకు పైగా విలువ గ‌ల‌ లగ్జరీ వాచ్‌లను స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని పొంగులేటి హర్ష నివాసంలో సోదాలు చేశారు కస్టమ్స్‌ అధికారులు. ప్రస్తుతం పొంగులేటి హర్ష.. రాఘవ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.


కస్టమ్స్ అధికారులకు సహాయంగా ఉన్న హైదరాబాద్‌ సిటీ పోలీస్ విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ సోదాల విషయాన్ని ధృవీకరించారు. దాదాపు 6 గంటల పాటు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. త‌న కుమారుడి నివాసంలో సోదాల గురించి మంత్రి పొంగులేటిని అడిగితే ఆయన సమాధానం దాటవేశారు. ప్రస్తుతం తాను ఢిల్లీలో ఉన్నానని, పార్టీ పనుల్లో బిజీగా ఉన్నానని సమాధానం చెప్పారు.

రూ.1.7 కోట్ల విలువైన చేతి గడియారాలను స్మగ్లింగ్ చేశారన్న కేసులో పొంగులేటి తనయుడు హర్షకు చెన్నై కస్టమ్స్‌ అధికారులు గతంలోనే సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 4న విచారణకు రావాలని కోరారు. కానీ, డెంగ్యూతో బాధపడుతున్న కారణంగా తాను విచారణకు రాలేకపోతున్నట్లు గతంలో అధికారులకు తెలిపారు హర్ష. తర్వాత వైద్యుల సూచన మేరకు ఏప్రిల్ 27న విచారణకు హాజరయ్యేందుకు ఆయన అంగీకరించారు.

First Published:  27 Jun 2024 7:13 AM GMT
Next Story