Telugu Global
Telangana

హైదరాబాద్ రోడ్లపై సైకిల్ ట్రాక్, వెండింగ్ జోన్, ఫుట్‌పాత్ ల‌తో ‘మోడల్ కారిడార్లు’ ఏర్పాటు

150 నుంచి 200 అడుగుల పొడవున రోడ్లు ఉన్న ప్రాంతాల్లోనే మోడల్ కారిడార్లను చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో పేర్కొంది. మొత్తం 21.5 కిలోమీటర్ల మేర మోడల్ కారిడార్లను రూ.568.2 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్ రోడ్లపై సైకిల్ ట్రాక్, వెండింగ్ జోన్, ఫుట్‌పాత్ ల‌తో ‘మోడల్ కారిడార్లు’ ఏర్పాటు
X

హైదరాబాద్‌లో త్వరలో కొన్ని ప్రాంతాల్లో 'మోడల్ కారిడార్లు' ఏర్పాటు చేయనున్నారు. కొన్ని ఎంపిక చేసిన రహదారులకు ఇరువైపులా పాదచారుల మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, పార్కింగ్ ప్రాంతాలు, వెండింగ్ జోన్‌లు ఏర్పాటు కానున్నాయి.

ఎల్‌బి నగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, మెహదీపట్నం, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాలలో మొత్తం 29 మోడల్ కారిడార్‌లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్లాన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ చేపట్టే రోడ్లకు ఇరువైపులా మోడల్ కారిడార్లు వస్తాయి. రహదారికి ఇరువైపులా వెండింగ్ జోన్, పార్కింగ్ ప్లేస్, సెగ్రెగేటర్, సైకిల్ ట్రాక్, ఫుట్‌పాత్ లు ఉంటాయి..

150 నుంచి 200 అడుగుల పొడవున రోడ్లు ఉన్న ప్రాంతాల్లోనే మోడల్ కారిడార్లను చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో పేర్కొంది. మొత్తం 21.5 కిలోమీటర్ల మేర మోడల్ కారిడార్లను రూ.568.2 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు.

ఈ మోడల్ కారిడార్‌లలో అందుబాటులో ఉన్న స్థలం, అవసరాలను బట్టి వెండింగ్ జోన్‌లు, సర్వీస్ రోడ్లు, పార్కింగ్ ఏరియాలు, ఫుట్‌పాత్‌లు, గ్రీనరీ పనులు చేపడతామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. హబ్సిగూడ నుండి నాగోల్, ఎల్‌బి నగర్ నుండి ఒవైసీ క్రాస్‌రోడ్స్, ఒవైసీ క్రాస్‌రోడ్ నుండి ఆరామ్‌ఘర్, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండిసి) నుండి షేక్‌పేట్ మీదుగా గచ్చిబౌలి వరకు రహదారికి ఇరువైపులా కారిడార్లు ప్లాన్ చేయబడ్డాయి.

మొత్తం 29 మోడల్ కారిడార్లలో ఒక్కో స్ట్రెచ్‌కు దాదాపు రూ. 34 లక్షల నుంచి రూ. 6 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, దీని పొడవు 90 మీటర్ల నుంచి 1840 మీటర్ల వరకు ఉంటుందని అంచనా. కొన్ని కారిడార్లకు టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించినట్లు జీహెచ్‌ఎంసీ తన ప్రకటనలో పేర్కొంది.

First Published:  19 Jan 2023 10:05 AM GMT
Next Story