ఆ ఐదింటిలో ఒక్కటైన ఇవ్వండి - కూనంనేని
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఈ విషయంపై మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో మళ్లీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన సీపీఐ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కలిసి పనిచేస్తామని చెప్తోంది. కానీ, కండీషన్స్ అప్లయ్ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు అసెంబ్లీ టికెట్లు డిమాండ్ చేసినప్పటికీ.. చివరికి ఒకే ఒక్క సీటుతో సీపీఐ సరిపెట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న సీపీఐ... తమకు ఓ స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది.
తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఈ విషయంపై మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని చెప్పారు. స్నేహధర్మం పాటించి తమకు సీట్లు కేటాయించాలన్నారు కూనంనేని. మేం కోరిన ఐదు నియోజకవర్గాల్లో ఒక ఎంపీ స్థానాన్ని తమకు కేటాయించాలన్నారు.
వరంగల్, మహబూబబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి స్థానాల్లో తమకు బలం ఉందని, ఈ ఐదు స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. సీపీఐకి ఒక స్థానం కేటాయించే సాహసం చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.