Telugu Global
Telangana

ఎంపీ ఎన్నికల వేళ రేవంత్‌కు బిగ్ షాక్

కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్‌ కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ బరిలో ఉన్నారు.

ఎంపీ ఎన్నికల వేళ రేవంత్‌కు బిగ్ షాక్
X

పార్లమెంట్ ఎన్నికలవేళ తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల కౌంటింగ్‌ వాయిదా పడింది. ఈమేరకు ఎన్నికల కమిషన్‌ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఓట్ల లెక్కింపు జూన్ 2న చేప‌ట్ట‌నున్నారు. వాస్తవానికి రేపే ఎమ్మెల్సీ ఉపఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ చేప‌ట్టొద్దంటూ ఈసీ ఆదేశించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాయిదా వేయాల‌ని కోరింది. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన‌ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేప‌ట్టాల‌ని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూన్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్‌ కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ బరిలో ఉన్నారు. గతనెల 28న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో గెలుపుపై అధికార కాంగ్రెస్ ధీమా కనబరిచింది. ఎమ్మెల్సీ ఫలితాల జోష్‌తో పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటాలాని కాంగ్రెస్ నాయకత్వం చూసింది. కానీ కాంగ్రెస్‌ నేతలకు ఈసీ గట్టి షాకిచ్చింది. కౌంటింగ్ వాయిదా పడటంతో హస్తం నేతలు నిరాశకు గురవుతున్నారు.

First Published:  1 April 2024 5:50 PM IST
Next Story