Telugu Global
Telangana

ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ కమలం పార్టీ హవా కొనసాగిస్తోంది.

ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
X

కరీంనగర్‌-నిజామాబాద్‌-మెదక్‌-ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో బీజేపీ ప్రతి రౌండ్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికి వరకు 3 రౌండ్లలో 63వేల ఓట్లను అధికారులు లెక్కించారు. బీజేపీ అభ్యర్థి 23,310 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థికి 18,812 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,880 ఓట్లు పోలయ్యాయి. . ప్రస్తుతం అంజిరెడ్డి 4,498 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా దాదాపు 1,33,000 వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఏ అభ్యర్థి అయినా విజయం సాధించాలంటే 1,12,000 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇదే ట్రెండ్‌ కొనసాగితే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలే అవకాశం లేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేయాల్సింది.

First Published:  4 March 2025 8:35 PM IST
Next Story