కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ స్టార్ట్..రాబోయేది బీజేపీనే : బండి సంజయ్
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీజేపీ విజయాన్ని అడ్డుకోలేకపోయిందని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్-ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. ప్రధాని మోదీ నిజాయితీ పాలనను ప్రజలు గుర్తించారని వారు తెలిపారు. డబ్బుల సంచులకు దీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించాయి. రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేతలు కొన్నాళ్లుగా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది... ఇప్పుడేమంటారు? కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కలిసి బీజేపీను ఓడించాలని కుట్ర చేశాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటూ.. కమలం పార్టీ వైపు చూస్తున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ భారీ విజయం సాధించనుందని బండి సంజయ్ తెలిపారు