ప్రారంభం కానున్న ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్
పొద్దున కౌన్సెలింగ్ కోసం వచ్చి తిరిగి వెళ్లిపోయిన వారిని తిరిగి రప్పిస్తున్న డీఈవోలు
తెలంగాణలో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది. ఇవాళ ఉదయం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ టెక్నికల్ కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. తాజాగా టెక్నికల్ సమస్యను నిపుణులు పరిష్కరించారు. దీంతో తిరిగి కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. పొద్దున వచ్చి తిరిగి వెళ్లిపోయిన వారికి డీఈవోలు మళ్లీ సమాచారం ఇచ్చి రప్పిస్తున్నారు.
డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామకపత్రాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు ఇవాళ పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలిపింది. నూతన టీచర్లు ఆయా డీఈవోలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నది. వారు తమకు కేటాయించిన పాఠశాలలలో ఈ నెల 16వ తేదీన చేరాల్సి ఉంటుందని, వారి చేరిన స్థానంలో మూడు నెలల కిందట బదిలీఅయి రిలీవ్ కాని వారు ఉంటే గత జులైలో కేటాయించిన పాఠశాలకు వెళ్తారని, అలాంటి వారు దాదాపు 7 వేల మంది ఉన్నారు. పోస్గింగ్‌ల కేటాయింపు మంగళవారం దాదాపు పూర్తవుతుందని, ఏవైనా మిగిలితే బుధవారం కూడా జరుగుతుందని విద్యా శాఖ వర్గాలు చెప్పాయి. దీంతో కౌన్సెలింగ్ వెళ్లిన అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. సాంకేతిక సమస్య కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. తదుపరి కౌన్సెలింగ్ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. దీందో చేసేది ఏమీ లేక అభ్యర్థులు వెనుదిరిగారు. ఇప్పుడు మళ్లీ యథావిధిగా కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని విద్యాశాఖ తెలిపింది.