తెలంగాణపై బీజేపీ కుట్రలు చేస్తోంది.. తమ్మినేని వీరభద్రం
మునుగోడులో బీజేపీని ఓడించగలిగే పార్టీ టీఆరెస్ మాత్రమే అని, అందుకే తాము ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణపై బీజేపీ కుట్రలు చేస్తోందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. టీఆరెస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ చెప్పడం హాస్యాస్పదమని, బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ నిలబడ్డారని, ఆయన అన్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో శనివారం ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడారు. .. ఈ ఎన్నికలో టీఆరెస్ కి తాము మద్దతునిచ్చినంత మాత్రాన. తమ పోరాటం ఆగదని అన్నారు. ఇది 'రాజకీయ ఎత్తుగడ అనుకోండి' అని వ్యాఖ్యానించారు. త్వరలో భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు.ఈ యాత్రలో ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు.
'నా కుటుంబంపై వచ్చిన ఆరోపణలకు, టీఆరెస్ పార్టీకి ప్రకటించిన మద్దతుకు సంబంధం లేదు.. హత్యా రాజకీయాలకు నేను ఎప్పుడూ దూరం' అని తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. తాను ఎవరినీ భయపెట్టనని, ఆ అవసరం కూడా లేదని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న పోరాటాన్ని తాము స్వాగతిస్తున్నామని వీరభద్రం తెలిపారు. ఈ ఒక్క ఎన్నికలో మాత్రమే టీఆరెస్ కి తమ మద్దతు అని స్పష్టం చేశారు. తెలంగాణాలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తెరాసకు సపోర్ట్ ఇవ్వాలన్న తమ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. మునుగోడు ఎన్నికలో ప్రధాన పోటీ తెరాస-బీజేపీ మధ్యే ఉంటుందని, కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
,