Telugu Global
Telangana

మూసీ పేరుతో మూటలు కూడబెట్టుకునే కుట్రలు

మూసీ పునరుజ్జీవం ఎవరి కోసం చేస్తున్నారు? స్థిరాస్థి వ్యాపారానికి కాదా? అని ప్రశ్నించిన కేటీఆర్‌

మూసీ పేరుతో మూటలు కూడబెట్టుకునే కుట్రలు
X

మూసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూటలు కూడబెట్టుకునే కుట్రలు చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని నాచారంలోని ఎస్టీపీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మా ప్రభుత్వ హయాంలోనే మూసీ సుందరీకరణ పనులు ప్రారంభించామన్నారు. మేము ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లామన్నారు. ముందు నీళ్లు బాగుచేయాలి. బ్రిడ్జిలు కట్టాలి. అనంతరం గోదావరి నీళ్లు తేవాలి. ఆ తర్వాత ఎన్ని ఇళ్లు తొలిగించాల్సి వస్తుంది? ఎన్ని ఇళ్లు ఆక్రమణకు గురయ్యాయి? వాటిని చూడాలని తాము ఆలోచన చేశామన్నారు. కానీ కాంగ్రెస్‌ సర్కార్‌ మూసీ పేరుతో పేదల పొట్టగొట్టాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి పేదల ఇళ్లు కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తాము ఎప్పుడై పేదల వైపే నిలుస్తామన్నారు. అవసరమైతే ప్రభుత్వంపై పోరాటం చేస్తాన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన ఎస్టీపీల (మురుగు నీటి శుద్ధి కేంద్రాలు) వల్ల మురుగు నీటి శుద్ధి జరుగుతున్నదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధికి దాదాపు రూ. 4000 కోట్లు కేటాయించామన్నారు. అప్పుడు నిర్మించిన ఎస్టీపీలనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కేసీఆర్‌ ఎప్పుడో మూసీ పునరుజ్జీవం పనులు ప్రారంభించారని తెలిపారు. ఇప్పడు మీరు వచ్చి కొత్తగా చేయాల్సింది ఏమీ లేదన్నారు.

రుణమాఫీకి, రైతుబంధుకు ప్రభుత్వం వద్ద పైసలు లేవన్నారు. ఏ పథకం అమలు చేయాలన్నా పైసలు లేవని మంత్రులు అంటున్నారు.మూసీ పునరుజ్జీవానికి మాత్రమే ప్రభుత్వం వద్ద పైసలు ఉన్నాయి. దీనికి రూ. లక్షన్నర కోట్లు ఖర్చ చేయనున్నట్లు సీఎం చెప్పారు. మూసీ పునరుజ్జీవం ఎవరి కోసం చేస్తున్నారు? స్థిరాస్థి వ్యాపారానికి కాదా? అని ప్రశ్నించారు. మూసీ పేరు చెప్పి కాంగ్రెస్‌ దోచుకుంటున్నది. మూసీ బ్యూటిఫికేషన్‌కు తాము వ్యతిరేకం కాదని లూటిఫికేషన్‌కే వ్యతిరేకం అన్నారు. ఇక్కడి నిర్వాసితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటున్నారు.

First Published:  27 Oct 2024 1:17 PM IST
Next Story