Telugu Global
Telangana

కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్‌కే 2 ఎమ్మెల్సీలు..!

కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌కు ఇంకో ఎమ్మెల్సీ వస్తుంది. కానీ, ఎన్నికలసంఘం ఈ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు, వేర్వేరుగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్‌కే 2 ఎమ్మెల్సీలు..!
X

ఈనెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలను అధికార కాంగ్రెస్‌ పార్టీనే దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంఖ్యాబలం పరంగా చూస్తే కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌కు ఇంకో ఎమ్మెల్సీ వస్తుంది. కానీ, ఎన్నికలసంఘం ఈ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు, వేర్వేరుగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీకే రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి.

ఒక అభ్యర్థికి కనీసం 59.5 ఓట్లు లభిస్తే ఆ అభ్యర్థిదే గెలుపు. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి 64 మంది సభ్యుల బలం ఉంది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 2 స్థానాలకు వేర్వేరుగా 119 మంది సభ్యులు రెండుసార్లు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అంటే మెజారిటీ ఉన్న కాంగ్రెస్ సభ్యులు రెండుసార్లు ఓటేస్తారు. అలా రెండు స్థానాలూ కాంగ్రెస్‌కే దక్కుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎమ్మెల్సీలుగా వీరిద్దరికీ 30 నవంబర్‌ 2027 వరకు గడువు ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడంతో ఇద్దరూ గతనెల 9న తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రకంగా BRS రెండు ఎమ్మెల్సీ ప‌ద‌వులు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లబోతున్నాయి.

First Published:  6 Jan 2024 1:39 PM IST
Next Story