Telugu Global
Telangana

మూసీని ఏటీఎంలా మార్చుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందన్న కేంద్ర మంత్రి సంజయ్‌

మూసీని ఏటీఎంలా మార్చుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌
X

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని, మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర మంత్రి సంజయ్‌ తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ ఏటీఎంలా వాడుకున్నదని, మూసీని కాంగ్రెస్‌ ఏటీఎంలా మార్చుకోవాలనుకుంటున్నదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పేరుతో రూ. లక్షన్నర కోట్ల అప్పులు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వడ్డీల రూపంలో 10 నెలల్లోనే రూ. 60 వేల కోట్లు చెల్లించారు. పాలకులు చేస్తున్న అప్పులతో ప్రజలపై భారం పడుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ కాంగ్రెస్‌ దోపిడీ, పేదల ఇళ్ల కూల్చివేతలకు మాత్రమే వ్యతిరేకం అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా చేపడుతున్నామని సంజయ్‌ తెలిపారు.

First Published:  24 Oct 2024 7:32 AM GMT
Next Story