Telugu Global
Telangana

'6+66' కాంగ్రెస్ జంబో మేనిఫెస్టో..

సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజా దర్బార్ అనేది మరో కీలక అంశం. ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేసి వారికి 250 చదరపు గజాల ఇళ్ల స్థలం ఇవ్వడం, రైతులకు రుణమాఫీ, వడ్డీలేని రైతు రుణాలు.. ఇలా 42 పేజీలతో జంబో మేనిఫెస్టోతో కూడిన బుక్ లెట్ విడుదల చేసింది కాంగ్రెస్.

6+66 కాంగ్రెస్ జంబో మేనిఫెస్టో..
X

ఆరు గ్యారెంటీలు ఆల్రడీ ప్రకటించేశారు. ఇప్పుడు వాటికి అదనంగా 66 హామీలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. గాంధీ భవన్‌ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మేనిఫెస్టో విడుదల చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


అమరవీరుల కుటుంబాలకు గౌరవ భృతి..

తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన బలిదానాలు ఆ పార్టీకి శాపంగా మారాయనే విషయంలో మధనపడుతోంది. అందుకే మేనిఫెస్టో విడుదలకు ఒకరోజు ముందుగా చిదంబరం హైదరాబాద్ వచ్చి బలిదానాల విషయంలో సారీ చెప్పారు. ఇప్పుడు మేనిఫెస్టోలో అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25వేల గౌరవ పెన్షన్ అందిస్తామనే కీలక హామీ ఇచ్చారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.





ప్రజా దర్బార్..

సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజా దర్బార్ అనేది మరో కీలక అంశం. ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేసి వారికి 250 చదరపు గజాల ఇళ్ల స్థలం ఇవ్వడం, రైతులకు రుణమాఫీ, వడ్డీలేని రైతు రుణాలు.. ఇలా 42 పేజీలతో జంబో మేనిఫెస్టోతో కూడిన బుక్ లెట్ విడుదల చేసింది కాంగ్రెస్.

24గంటల విద్యుత్..

వ్యవసాయానికి 24గంటల విద్యుత్ అనే విషయాన్ని మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సహజంగా ఇప్పటికే అమలులో ఉన్న పథకాల గురించి మేనిఫెస్టోలో ఎవరూ ప్రస్తావించరు కానీ, కాంగ్రెస్ విషయంలో కరెంటు సరఫరా అనేది పెద్ద నెగెటివ్ మార్క్ గా ఉంది. అందుకే 24 గంటల విద్యుత్ సరఫరా అంటూ నొక్కి వక్కాణిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

హామీలే హామీలు..

కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలు చూస్తే రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందా లేదా అనే అనుమానం కలగకమానదు. ఆ రేంజ్ లో హామీల వర్షం కురిపించారు హస్తం పార్టీ నేతలు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆల్రడీ ఆరు గ్యారెంటీలలో ఉండగా.. 18 ఏళ్లు దాటిన ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితం అనే హామీ కీలకంగా మారే అవకాశముంది. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం నడిపే ఓల్డ్ ఏజ్ హోమ్స్, జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు, తెల్ల రేషన్ కార్డులకు సన్నబియ్యం, దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలకు పెంచడం.. ఇలా చాలా హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. 'అభయహస్తం' అనే పేరుతో ఈ మేనిఫెస్టో విడుదల చేశారు.


First Published:  17 Nov 2023 2:57 PM IST
Next Story