వేడుకల వేళ.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నిందలు
తెలంగాణ కోసం ఎన్నో వర్గాల ప్రజలు పోరాటం చేశారని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై నిందలు వేయడం మొదలు పెట్టారు. గతంలో తెలంగాణ వేడుకలకు ఎప్పుడూ కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కానీ తాము మాత్రం రాజకీయాలకు అతీతంగా వేడుకలకు అందర్నీ ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కి కూడా ఆహ్వానం పంపించామన్నారు మంత్రి పొన్నం.
ట్యాంక్ బండ్ పై రేపు జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మేయర్ గద్వాల విజయ లక్ష్మి , రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్,ఎమ్మెల్యే దానం నాగేందర్ , ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య ఇతర ముఖ్య నేతలతో కలిసి పర్యవేక్షించడం… pic.twitter.com/xodTdgxIBT
— Ponnam Prabhakar (@PonnamLoksabha) June 1, 2024
తెలంగాణ కోసం ఎన్నో వర్గాల ప్రజలు పోరాటం చేశారని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. తెలంగాణ వచ్చాక పదేళ్లు నియంతృత్వ పాలన కొనసాగిందన్నారు పొన్నం. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. అమర వీరులను స్మరించుకుంటూ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని వివరించారు. రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు పొన్నం.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సరికొత్తగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. జయజయహే తెలంగాణ పాటకు కీరవాణి సంగీతాన్నివ్వడాన్ని ఉద్యమకారులు తప్పుబట్టారు. తెలంగాణ కళాకారులకు అవమానం జరిగిందని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర చిహ్నం విషయంలో కూడా వివాదం నెలకొంది. దీనిపై సంప్రదింపులు పూర్తి కాలేదని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గడం విశేషం. అయితే గత ప్రభుత్వం కూడా అధికారిక చిహ్నం విషయంలో ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదని అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వేడుకల వేళ.. ఆయన బీఆర్ఎస్ ని టార్గెట్ చేశారు.