Telugu Global
Telangana

పాపం భట్టి.. పొంగులేటిదే పైచేయి

ఖమ్మం టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌లో ముక్కోణపు పోటీ కనిపించింది. తన భార్య నందిని కోసం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సోదరుడు ప్రసాద్‌రెడ్డి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కుమారుడు యుగంధర్‌ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

పాపం భట్టి.. పొంగులేటిదే పైచేయి
X

ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఎట్టకేలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపిక ఎంతకీ కొలిక్కి రాకపోవడంతో ఈ మూడు స్థానాలను పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. తాజాగా, ఈ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్‌ చేసినట్టు సమాచారం. ఖమ్మం అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, కరీంనగర్‌ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు, హైదరాబాద్‌ అభ్యర్థిగా సమీర్‌ వల్లీవుల్లాను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వీరి పేర్లను అధికారికంగా ఇవాళ ప్రకటించనున్నారు.

MIMతో డీల్.. హైదరాబాద్‌లో డమ్మీ అభ్యర్థి!

గురువారం వెలిచాల రాజేందర్‌రావుతో కరీంనగర్‌ జిల్లా కాంగెస్‌ కమిటీ.. మానకొండూరు నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించడం ఇందుకు మరింత బలాన్నిస్తోంది. హైదరాబాద్‌ విషయంలో ఎంఐఎంతో కుదిరిన ఒప్పందం మేరకు డీసీసీ అధ్యక్షుడు సమీర్‌ వలీవుల్లాను డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు సమాచారం.

పొంగులేటిదే పైచేయి

ఖమ్మం టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌లో ముక్కోణపు పోటీ కనిపించింది. తన భార్య నందిని కోసం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సోదరుడు ప్రసాద్‌రెడ్డి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కుమారుడు యుగంధర్‌ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ పోటీలో పొంగులేటిదే పైచేయి అయింది. అసెంబ్లీ ఎన్నికల హామీ మేరకు పొంగులేటి సోదరుడికి టికెట్‌ ఖరారైనట్టు తెలిసింది.

First Published:  19 April 2024 7:53 AM IST
Next Story