జడ్సన్ రాయని పద్యం.. బాల్క సుమన్ ట్వీట్ వైరల్
అలా ప్రశ్నించిన వారిలో సీనియర్ నేత బక్క జడ్సన్ బలయ్యాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కాంగ్రెస్ పార్టీ బక్క జడ్సన్‌పై వేటు వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నాలుగు నెలల వ్యవధిలోనే విమర్శల పాలవుతోంది. చివరకు సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డిపై తిరగబడే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి.. పదవులను కాపాడుకునేందుకు చేస్తున్న రాజకీయాలపై పలువురు కాంగ్రెస్ సీనియర్లు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించిన వారిలో సీనియర్ నేత బక్క జడ్సన్ బలయ్యాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కాంగ్రెస్ పార్టీ బక్క జడ్సన్‌పై వేటు వేసింది.
।। జడ్సన్ రాయని పద్యం ।।
— Balka Suman (@balkasumantrs) April 4, 2024
ఒరేయ్ మీరే ఏలండిరా రాజ్యాలు
మనుషులను లేకుండా చేసి జీవచ్ఛవాలుగా మారి
మీరే ఏలండి
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు
మీలో మీరే అమ్మనక్కని బూతులు తిట్టుకోండి
మీరే తన్నుకోండి
కాంగ్రెస్ ను మీరే పంచుకోండి
మీ మలినాన్ని మోస్తున్నందుకు మీము వేల ఏండ్లనుంచే ఊరవతల…
రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని జడ్సన్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ 4 లక్షల సిమ్‌ల కొనుగోళ్ల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి OSD చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి ఉన్నారని ప్రెస్‌మీట్ పెట్టి మరీ జడ్సన్ చెప్పారు. దీంతో బక్క జడ్సన్‌ను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది కాంగ్రెస్. రేవంత్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకు జడ్సన్‌పై వేటు వేసిందుకు గానూ.. మాజీఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బక్క జడ్సన్ రాయని పద్యం అంటూ ఆయన మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై రాసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి.