Telugu Global
Telangana

మైనార్టీ ఓట్లపై కాంగ్రెస్ బెంగ.. భారీ డిక్లరేషన్ ప్రకటన

బీజేపీ మాత్రమే ప్రత్యర్థి అయితే గుంపగుత్తగా మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కి పడేవి. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పథకాలు మైనార్టీలను ఆకర్షిస్తున్నాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యేక డిక్లరేషన్ అంటూ మైనార్టీ ఓట్లకు గేలం వేస్తోంది.

మైనార్టీ ఓట్లపై కాంగ్రెస్ బెంగ.. భారీ డిక్లరేషన్ ప్రకటన
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లపై బెంగ పెట్టుకుంది. ఎంఐఎం కూడా తాను పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ కే బహిరంగ మద్దతు తెలపడంతో కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. అంతే కాదు, ఎంఐఎం నేరుగా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. దీంతో ముస్లిం ఓట్లు తమకు పడవేమోననే అనుమానం నాయకుల్లో ఉంది. అందుకే ఆరు గ్యారెంటీలతోపాటు మైనార్టీలకోసం భారీ డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్. హైదరాబాద్ సిటీ కన్వెన్షన్ లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింనేతల సమక్షంలో డిక్లరేషన్ ప్రకటించారు.


మైనార్టీ డిక్లరేషన్ ముఖ్యాంశాలు..

- ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం.

- వక్ఫ్ భూములను డిజిటలైజ్ చేయడం.

- మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ ఏర్పాటు.

- మైనార్టీలకు ఇంటి స్థలంతోపాటు గృహ నిర్మాణానికి రూ.5లక్షల నగదు సాయం.

- ఉర్దూ మీడియం టీచర్ల కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహణ.

- మైనార్టీల కోసం ఏడాదికి రూ.4వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు

- మైనార్టీలకోసం వెయ్యి కోట్ల రూపాయల రుణాలు

- ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి కేటాయింపు

- కొత్తగా పెళ్లైన జంటలకు రూ.1.6 లక్షల ఆర్థిక సాయం

బీజేపీ మాత్రమే ప్రత్యర్థి అయితే గుంపగుత్తగా మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కి పడేవి. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పథకాలు మైనార్టీలను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో ఎంఐఎం కూడా కాంగ్రెస్ వైపు మైనార్టీల ఓట్లు మళ్లకుండా అడ్డుకట్ట వేస్తోంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యేక డిక్లరేషన్ అంటూ మైనార్టీ ఓట్లకు గేలం వేస్తోంది.

First Published:  9 Nov 2023 9:50 PM IST
Next Story