Telugu Global
Telangana

షర్మిలకు కాంగ్రెస్ రెండు బంపర్‌ ఆఫర్లు

షర్మిలకు కాంగ్రెస్‌ రెండు ఆఫర్లు ఇచ్చినట్లు స‌మాచారం. ఖమ్మం లోక్‌సభ సీటుతో పాటు ప్రియాంక గాంధీతో సమానంగా AICC జనరల్ సెక్రటరీ పోస్టు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

షర్మిలకు కాంగ్రెస్ రెండు బంపర్‌ ఆఫర్లు
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. వైఎస్సార్టీపీ.. కాంగ్రెస్‌లో విలీనానికి అంత సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్ గాంధీలతో పార్టీ విలీనంపై చర్చించనున్నారు. తర్వాత కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై రాహుల్ గాంధీ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

అయితే షర్మిలకు కాంగ్రెస్‌ రెండు ఆఫర్లు ఇచ్చినట్లు స‌మాచారం. ఖమ్మం లోక్‌సభ సీటుతో పాటు ప్రియాంక గాంధీతో సమానంగా AICC జనరల్ సెక్రటరీ పోస్టు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మొదట రాజ్యసభ సీటు ఆఫర్‌ చేయగా.. అందుకు షర్మిల నిరాకరించారు. పాలేరు టికెట్‌ కోసం షర్మిల పట్టుబట్టగా అందుకు.. కాంగ్రెస్ అధిష్టానం నో చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్‌ స్ట్రాటజిస్టు సునీల్‌ కనుగోలుతో భేటీ తర్వాత షర్మిల కాంప్రమైజ్ అయ్యారని తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్‌ను చూసుకోవాలని చెప్పినప్పటికీ.. తాను తెలంగాణలోనే ఉంటానని షర్మిల పట్టుపట్టినట్లు సమాచారం.

First Published:  2 Oct 2023 7:01 PM IST
Next Story