తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతుంది. ఇదే స్థానం నుంచి గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు మల్లన్న.
తీన్మార్ మల్లన్నకు బంపర్ ఆఫర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమిచ్చింది. నల్గొండ - ఖమ్మం- వరంగల్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్లన్నను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన రిలీజ్ చేశారు.
జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతుంది. ఇదే స్థానం నుంచి గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు మల్లన్న.
2021 మార్చిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పల్లా ఎమ్మెల్సీ పదవికి డిసెంబరు 09న రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఈ స్థానానికి సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పేరు వినిపిస్తోంది.