ఎంపీ స్థానాలకు కో-ఆర్డినేటర్లు.. రేవంత్‌కు ఆ రెండు బాధ్యత..!
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చేవెళ్ల, మహబూబ్‌నగర్ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. డిప్యూటీ సీఎం భట్టికి సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల బాధ్యతను అప్పగించింది.
పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సహా వివిధ రకాల కమిటీలను నియమించిన AICC.. తాజాగా పార్లమెంట్ స్థానాలకు కో-ఆర్డినేటర్లను నియమించింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు కో-ఆర్డినేటర్లను నియమించింది. కో-ఆర్డినేటర్లుగా మంత్రులు, సీనియర్ లీడర్లకు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చేవెళ్ల, మహబూబ్‌నగర్ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. డిప్యూటీ సీఎం భట్టికి సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల బాధ్యతను అప్పగించింది.
పార్లమెంట్ స్థానాల కో-ఆర్డినేటర్ల జాబితా ఇదే-
రేవంత్ రెడ్డి - మహబూబ్‌నగర్, చేవెళ్ల
భట్టి విక్రమార్క - సికింద్రాబాద్, హైదరాబాద్
పొంగులేటి - మహబూబబాద్, ఖమ్మం
పొన్నం ప్రభాకర్ - కరీంనగర్
జీవన్ రెడ్డి - నిజామాబాద్
ఉత్తమ్ కుమార్ రెడ్డి - నల్గొండ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - భువనగిరి
జూపల్లి కృష్ణారావు - నాగర్‌కర్నూలు
దామోదర రాజనర్సింహ - మెదక్
సుదర్శన్ రెడ్డి - జహీరాబాద్
తుమ్మల నాగేశ్వర రావు - మల్కాజ్‌గిరి
సీతక్క - ఆదిలాబాద్
శ్రీధర్ బాబు - పెద్దపల్లి
కొండా సురేఖ - వరంగల్
ఇక ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని పార్లమెంట్ స్థానాలకు కో-ఆర్డినేటర్లను నియమించింది AICC.