Telugu Global
Telangana

నా వల్ల కాదు.. మంచి రోజు చూసి తప్పుకుంటా- ఉత్తమ్

బీజేపీ పరిస్థితి ఏమంత బాగోలేదన్నారు. బీజేపీలో లోపలి వ్యక్తులు, బయటి వ్యక్తులు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందన్నారు. దేశంలో బీజేపీ ఊపు తగ్గిన మాట వాస్తవం అన్నారు ఉత్తమ్.

నా వల్ల కాదు.. మంచి రోజు చూసి తప్పుకుంటా- ఉత్తమ్
X

రాజకీయాలపై వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఈ రాజకీయాలు ఇక తన వల్ల కావు అంటూ వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌ చేసిన ఆయన 2018 నుంచి రాజకీయాలు పూర్తిగా డబ్బుమయం అయిపోయాయని ఆవేదన చెందారు. ఈ కమర్షియల్ పొలిటిక్స్‌కు తాను సెట్‌ అవను అంటూ మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికే 30 ఏళ్లు అవుతోందని ఒక మంచి రోజు చూసుకుని, అక్టోబర్‌ లేదా నవంబర్‌లో పొలిటిక్ రిటైర్మెంట్‌ తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు.

తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు రెండూ ఒకేసారి వస్తే కాంగ్రెస్‌కు లాభిస్తుందన్నారు. శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు అని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం ఆప్‌కు గట్టి దెబ్బేనన్నారు. కాంగ్రెస్‌లోకి షర్మిల వస్తారో లేదో తనకు తెలియదన్నారు. షర్మిలతో కాంగ్రెస్‌లోని పెద్దలే మాట్లాడి ఉంటారన్నారు.

బీజేపీ పరిస్థితి ఏమంత బాగోలేదన్నారు. బీజేపీలో లోపలి వ్యక్తులు, బయటి వ్యక్తులు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందన్నారు. దేశంలో బీజేపీ ఊపు తగ్గిన మాట వాస్తవం అన్నారు ఉత్తమ్. అయితే ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేవలం డబ్బులు ఖర్చు చేయనిదే పోటీ సాధ్యం కాని ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుంచి మాత్రమే తప్పుకుంటారా లేక పూర్తిగా రాజకీయాలు వదిలేస్తారా అన్నది వేచిచూడాలి. కాకపోతే రాజకీయ నాయకులకు ఇలాంటి వైరాగ్యం అప్పుడప్పుడు వస్తుంటుంది. 100 ఏళ్లు వచ్చినా రేస్‌ నుంచి మాత్రం తప్పుకోరు. మరి ఉత్తమ్‌ ఏం చేస్తారో చూడాలి.

First Published:  2 Jun 2023 5:19 PM IST
Next Story