Telugu Global
Telangana

కరెంట్ కోతలపై మీ ఎమ్మెల్సీకైనా సమాధానం చెప్పండి..!

అప్పట్లో పిడుగులు పడ్డా కరెంట్ తీసిన సందర్భాలు చాలా తక్కువ. కానీ, ఇప్పుడు పరిస్థితి మరీ దిగజారిపోయింది. వర్షం పడే సూచనలు లేకున్నా కరెంట్ తీసేస్తున్నారు.

కరెంట్ కోతలపై మీ ఎమ్మెల్సీకైనా సమాధానం చెప్పండి..!
X

తెలంగాణలో BRS హయాంలో కరెంట్ కోతలు లేవనేది ఎంత వాస్తవమో.. కాంగ్రెస్ వచ్చాక కరెంట్ కోతలు పెరిగాయన్నది అంతే నిజం. కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎందుకు పోతుందో జ‌నానికి తెలియని పరిస్థితి. జనాలే కాదు కాంగ్రెస్‌ లీడర్లు కూడా ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరెంట్‌ కోతల సెగ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌కు కూడా తగిలింది. ఆయన ఆధ్వర్యంలో నడిచే "Q న్యూస్" మార్నింగ్‌ లైవ్‌లోనే తీన్మార్ మల్లన్న కరెంట్ కోతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఉప్పల్‌ పరిధిలోని పీర్జాదిగూడ, మేడిపల్లిలో కరెంట్ ఎందుకు పోతుందో అర్థం కావడం లేదు. కరెంట్ అధికారులు పని చేస్తున్నారా లేదా, జనం తిట్టుకుంటున్నారు" అంటూ సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వెల్లగక్కారు తీన్మార్‌ మల్లన్న.


కేసీఆర్ హయాంలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు వందకు వంద మార్కులు వేయాల్సిందే. అప్పట్లో పిడుగులు పడ్డా కరెంట్ తీసిన సందర్భాలు చాలా తక్కువ. కానీ, ఇప్పుడు పరిస్థితి మరీ దిగజారిపోయింది. వర్షం పడే సూచనలు లేకున్నా కరెంట్ తీసేస్తున్నారు. ఒక్కోసారి గంటల తరబడి పవర్ కట్స్ ఉంటున్నాయి. ఈ విషయంలో జనాలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిజాన్ని అంగీకరించలేకపోతోంది. అసలు కరెంట్ కోతలే లేవంటూ బుకాయిస్తోంది. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెడుతోంది. అరగంట కరెంట్ పోతే కొంపలు మునిగిపోతాయా అంటూ ఎమ్మెల్యేలు ప్రభుత్వ చేతగాని తనాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరెంట్ సరఫరా విషయంలో జనాలు గత ప్రభుత్వం పనితీరును కొనియాడుతున్నారు.

First Published:  11 Aug 2024 7:34 PM IST
Next Story