Telugu Global
Telangana

పోచారం చేరికను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఇలాంటి వాటిని తాను వ్యక్తిగతంగా ప్రోత్సహించనని కుండ బద్దలు కొట్టారు జీవన్ రెడ్డి. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పని చేయాలంటూ సొంతపార్టీకే చురకలంటించారు.

పోచారం చేరికను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
X

మాజీ స్పీకర్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం అవకాశవాద రాజకీయమన్నారు ఆపార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. రాష్ట్రంలో 65 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం సుస్థిరంగా ఉందని, ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదన్నారు. ఇలాంటి వాటిని తాను వ్యక్తిగతంగా ప్రోత్సహించనని కుండ బద్దలు కొట్టారు జీవన్ రెడ్డి. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పని చేయాలంటూ సొంతపార్టీకే చురకలంటించారు.


పోచారం శ్రీనివాసరెడ్డి అన్నీ పదవులు అనుభవించి, పార్టీని వదిలి వెళ్లడంపై బీఆర్‌ఎస్‌ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో పోచారం, ఆయన కుటుంబ సభ్యుల గురించి రేవంత్‌రెడ్డి నీచంగా మాట్లాడిన విషయాన్ని గులాబీ నేతలు గుర్తు చేస్తున్నారు. పోచారం గురించి అంతలా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సిగ్గులేకుండా పార్టీలో చేర్చుకున్నారని మండిపడుతున్నారు. కేసీఆర్‌ రుణం తీర్చుకోలేనిదని గతంలో చెప్పిన పోచారం.. ఇప్పుడు పార్టీకి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  23 Jun 2024 8:17 AM GMT
Next Story