హైడ్రా పై కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
మ్యాన్ హట్టన్ ప్రాజెక్టు పై మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.
BY Vamshi Kotas17 March 2025 5:00 PM IST

X
Vamshi Kotas Updated On: 17 March 2025 5:00 PM IST
హైడ్రాపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోన్ లిఫ్ట్ చేయడు.. ఆయన దగ్గర నుండి ఎలాంటి అన్సర్ ఉండదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఖాజాగూడలోని కొత్తకుంటలో వంశీరాం బిల్డర్లు నిర్మాణాల విషయంలో ఇటీవల హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హైడ్రాపై మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Next Story