Home > NEWS > Telangana > రాష్ట్రపతి ఎన్నికలు: బీజేపీ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
రాష్ట్రపతి ఎన్నికలు: బీజేపీ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రమైన పొరపాటు చేశారు.
BY Telugu Global18 July 2022 12:44 PM IST

X
Telugu Global Updated On: 18 July 2022 12:59 PM IST
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రమైన పొరపాటు చేశారు.
తమ పార్టీ మద్దతు ఇస్తున్న యశ్వంత్ సిన్హాకు బదులు బీజేపీ అభ్యర్థి ద్రౌపతి ముర్ముకు ఆమె ఓటు వేశారు. అయితే ఓటు వేసిన వెంటనే తన పొరపాటును గుర్తించిన సీతక్క ఎన్నికల అధికారులను కలిశారు. తాను పొరపాటుగా ద్రౌపతి ముర్ముకు ఓటు వేశానని, కాబట్టి తనకు మళ్ళీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. అయితే నిబంధనల ప్రకారం ఒకసారి ఓటు వేశాక మళ్ళీ వేసే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. దాంతో ఏం చేయాలో అర్దం కాని సీతక్క అసెంబ్లీ నుంచి బైటికి వచ్చేశారు. తాను పొరపాటుగా ముర్ముకు ఓటు వేశానని కావాలని వేయలేదని ఆమె మీడియాతో చెప్పారు.
Next Story