నోటుకు సీటు.. రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు
మహేశ్వరం టికెట్ బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహరెడ్డికి టికెట్ కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త మనోహర్ రెడ్డి ఆరోపణలు సంచలనంగా మారాయి.
కాంగ్రెస్‌లో నోటుకు సీటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణ చేశారు కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి. మహేశ్వరం టికెట్ కోసం బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహరెడ్డి దగ్గర.. రేవంత్ రెడ్డి రూ.10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయం సీనియర్ లీడర్ వి.హెచ్. కూడా తనతో చెప్పారన్నారు. సమయం వచ్చినపుడు సాక్ష్యాలతో సహా బయటపెడతానన్నారు మనోహర్ రెడ్డి. ఇప్పుడు ఈ అంశం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2023
మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి 10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని ఆరోపించిన కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి...
సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో సహా బైట పెడతా అంటున్న మనోహర్ రెడ్డి...
మహేశ్వరం… pic.twitter.com/HEiYH0DLVl
మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ కోసం ఐదుగురు నేతలు గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆశావహుల్లో డీసీసీ చీఫ్ చల్లా నర్సింహరెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎల్మేటి అమరేందర్ రెడ్డి ఉన్నారు. అయితే మహేశ్వరం టికెట్ బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహరెడ్డికి టికెట్ కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త మనోహర్ రెడ్డి ఆరోపణలు సంచలనంగా మారాయి.
అయితే ఈ వ్యవహరంపై పార్టీ సీనియర్లను ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తున్నారని తెలుస్తోంది. మహేశ్వరం టికెట్ ఇంకా ఎవరికీ కన్ఫామ్ చేయలేదని చెప్తున్నారు. చిగురింత పారిజాతకు టికెట్ కన్ఫామ్ అయిందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు.