కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు.. ఈసారి ఎక్కడంటే..?
తెలంగాణ తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు కూడా పోస్టర్లపై ఉన్నాయి. ఈ పోస్టర్లలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చిత్రాలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మళ్లీ పోస్టర్లు కలకలం రేపాయి. ఈసారి హైదరాబాద్‌లో కాకుండా నిజామాబాద్, బోధన్ పట్టణాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు ఎవరు అతికించారనేదానిపై స్పష్టత లేదు. రాహుల్ గాంధీ ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది.
బలిదానాలకు బాధ్యత మీదే.. మా బిడ్డలను సంపింది మీరే... క్షమాపణ చెప్పాల్సిందే. ముక్కునేలకు రాయాల్సిందే.. కర్ణాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే.. అంటూ మరో పోస్టర్ ఉంది. 2 లక్షల ఉద్యోగాల హామీని కాంగ్రెస్ మరిచిపోయిందంటూ ఆ పోస్టర్‌లో ఓ వార్తకథనం క్లిప్పింగ్‌ను ముద్రించారు. ఇక కరెంటు లేక కర్ణాటక అల్లాడుతోందంటూ మరో పోస్టర్ అతికించారు. తెలంగాణ తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు కూడా పోస్టర్లపై ఉన్నాయి. ఈ పోస్టర్లలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చిత్రాలు ఉన్నాయి.
నిజామాబాద్, బోధన్ లో పోస్టర్ల కలకలం
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2023
రాహుల్ గాంధీ బోధన్ రాకను నిరసిస్తూ వెలిసిన పోస్టర్లు
బలిదానాల బాధ్యత కాంగ్రెస్ పార్టీదే... మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొని ఉన్న పోస్టర్లు
కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే... ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్
పోస్టర్లలో… pic.twitter.com/OwOUh5NcCH
రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు ఇదే మొదటి సారి కాదు. గతంలో GHMC పరిధిలోనూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. బీఆర్‌ఎస్ నేతల పనేనని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.