Telugu Global
Telangana

కేటీఆర్ డెడ్ లైన్ పెట్టారు.. కాంగ్రెస్ స్పందించక తప్పలేదు

కేటీఆర్ డెడ్ లైన్ పెట్టిన గంటల వ్యవధిలోనే పంప్ లు ఆన్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.

కేటీఆర్ డెడ్ లైన్ పెట్టారు.. కాంగ్రెస్ స్పందించక తప్పలేదు
X

ఆగస్ట్-2 లోగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తిపోతల పంప్ లు ఆన్ చేసి నీళ్లు లిఫ్ట్ చేయకపోతే 50వేల మంది రైతులతో కదం తొక్కుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన సంగతి తెలిసిందే. మీరు నీళ్లిస్తారా, మమ్మల్ని నీళ్లు వదలమంటారా అని అల్టిమేట్టం ఇచ్చారాయన. దీంతో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. కేటీఆర్ డెడ్ లైన్ పెట్టిన గంటల వ్యవధిలోనే పంప్ లు ఆన్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చింది.


నంది మేడారం పంప్ హౌస్‌లో మూడు మోటార్లు, గాయత్రి పంప్ హౌస్‌లో ఒక మోటార్‌ను ఈరోజు అధికారులు ఆన్‌ చేసి నీటిని లిఫ్ట్‌ చేస్తున్నారు. ఈ నీటితో ఆయా ప్రాంతాల్లో ఆయకట్టు ఉన్న రైతాంగానికి ఉపశమనం దొరికినట్టయింది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల సమస్యలు తీర్చేది బీఆర్ఎస్సేనంటున్నారు ఆ పార్టీ నేతలు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ డ్యామేజ్ అయిందనే కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పంప్ లతో నీటిని తోడిపోయకుండా మేడిగడ్డ నుంచి నేరుగా కిందకు విడుదల చేస్తోంది. ఓవైపు గోదావరికి వరదపోటెత్తినా, నీరు వృథాగా కిందికి పోతున్నా సరైన నిర్ణయం తీసుకోడానికి కాంగ్రెస్ వెనకాడుతోంది. దీంతో బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. వాస్తవ పరిస్థితిని ప్రజల ముందుంచారు. కేవలం తమపై కక్షతో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అయితే బీఆర్ఎస్ చెప్పినట్టు నీటిని ఎత్తిపోస్తే, రేపు ప్రాజెక్ట్ కి ఏదైనా అయితే 40 గ్రామాలు ఇబ్బంది పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బదులిచ్చారు. చివరకు రైతాంగంలో తిరుగుబాటు వస్తుందనే భయంతో కాంగ్రెస్ నష్టనివారణ చర్యలు చేపట్టిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మోటర్లు ఆన్ చేసి, నీటిని లిఫ్ట్ చేయడం తమ ఘనతేనంటున్నారు.

First Published:  27 July 2024 11:29 AM GMT
Next Story