Telugu Global
Telangana

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం.. ఏం చెప్పారంటే!

కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రెవెన్యూ మిగులు స్టేట్‌గా ఉందని, దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్ ఆర్థిక వ్యవస్థగా ఉండేదని శ్వేతపత్రంలో పేర్కొంది. కానీ ఇప్పుడదే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని స్ఫష్టం చేసింది.

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం.. ఏం చెప్పారంటే!
X

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రెవెన్యూ మిగులు స్టేట్‌గా ఉందని, దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్ ఆర్థిక వ్యవస్థగా ఉండేదని శ్వేతపత్రంలో పేర్కొంది. కానీ ఇప్పుడదే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని స్ఫష్టం చేసింది. దాదాపు 10 రెట్ల వరకూ రుణాలు తీసుకున్నట్లు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. గత పదేళ్లలో తెచ్చిన అప్పులతో ఎలాంటి ఆస్తులు సృష్టించలేదన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, మిషన్ భగీరథ లాంటి మెగా ప్రాజెక్టుల పేరుతో బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవడం ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పరిస్థితి సమూలంగా మారిందని పేర్కొంది. మొత్తం 42 పేజీలతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు.

ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని, గత ప్రభుత్వం వనరులను సక్రమంగా వినియోగించుకోలేదన్నారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క. రోజూవారీ ఖర్చులకు ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇది దురదృష్టకరమన్నారు. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమించి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు భట్టి విక్రమార్క.

శ్వేతపత్రంలోని కీలకాంశాలు ఇవే..

రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు

2014-15 నాటికి రాష్ట్ర రుణం ₹72,658 కోట్లు

2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు

2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం ₹3,89,673 కోట్లు

2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం

2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం

బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం

57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ₹4.98 లక్షల కోట్ల వ్యయం

రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం

రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం

రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం

రోజూ వేస్‌ అండ్‌ మీన్స్‌పై ఆధారపడాల్సిన దుస్థితి

బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ

First Published:  20 Dec 2023 1:30 PM IST
Next Story