Telugu Global
Telangana

కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అభిమానులు ఉన్నారు : కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ అభిమానులు ఉన్నారని ఏం జరుగుతుందో అంతా మాకు చెబుతారు.. మొత్తం బయటకు వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అభిమానులు ఉన్నారు : కేటీఆర్
X

కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ అభిమానులు ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో ఏం జరిగినా తమకు తెలుస్తుందని చెప్పారు తప్పకుండా అన్నీ బయటకు వస్తాయని , అన్నీ బయట పెడతామని కేటీఆర్ హెచ్చరించారు.. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. రేవంత్ రెడ్డి పదవిని లాక్కోడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉద్యోగాలు పోయినట్లే రేవంత్ కూడా తన ఉద్యోగం కోల్పోబోతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తన బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తరచుగా చెబుతున్న ఫోర్త్ సిటీ కాదని.. ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అని ఆరోపించారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తమకు ఎక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా? అని అన్నారు. కొడంగల్ లిఫ్ట్ కథ సహా.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అవినీతిని తేలుస్తామని కేటీఆర్ అన్నారు. బావమరిది వ్యవహారంలో ఇరికిపోయానని సీఎంకు కూడా తెలుసునని అన్నారు. చట్టాలే కాదు.. చుట్టరికాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుందని కేటీఆర్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే వద్దకు మంత్రి పొంగులేటి తనతో కలిసి రావాలని మాజీ మంత్రి సవాల్ విసిరారు.

First Published:  22 Sept 2024 1:13 PM GMT
Next Story