దేశంలో అత్యున్నత పదవులను మహిళలకు ఇచ్చింది కాంగ్రెస్‌నే : సీఎం రేవంత్
చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.550 కోట్ల విలువైన కొత్త భవన నిర్మాణాలు పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు

తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీకి పెట్టుకోవడం తెలంగాణకు గొప్ప కీర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.550 కోట్ల విలువైన కొత్త భవన నిర్మాణాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చూట్టినారు.ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే సందర్భం వస్తుందని, అందులో మీ ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం ఇక్కడి విద్యార్థనుల అదృష్టమని, మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత ఫ్రీ బస్సు సౌకర్యం పథకాన్ని అమలు చేస్తున్నానన్న సీఎం రేవంత్ రెడ్డి.. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి స్కూళ్లు నిర్వహణ బాధ్యత అప్పగించామని తెలిపారు. అంతకుముందు విశ్వవిద్యాలయంలో దర్బార్ హాల్‌ను సీఎం సందర్శించారు. భారతదేశ రాజకీయాలలో రాష్ట్రపతి, ప్రధాని, లోక్ సభ స్పీకర్ వంటి ఉన్నతమైన పదవులను కట్టబెట్టిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని రంగాల్లో మహిళా యూనివర్సిటీ విద్యార్థులు రాణించి రాజీవ్ గాంధీ కలల్నినిజం చేయాలని పిలుపునిచ్చారు.