కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. తెలంగాణలో 4 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మరోసారి వయనాడ్ నుంచి బరిలో దిగనున్నారు. తెలంగాణ నుంచి ఫస్ట్ లిస్ట్‌లో జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది.
రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. సుదీర్ఘ కసరత్తు తర్వాత 36 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 4 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మరోసారి వయనాడ్ నుంచి బరిలో దిగనున్నారు.
తెలంగాణ నుంచి ఫస్ట్ లిస్ట్‌లో జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి అనూహ్యంగా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి అవకాశమిచ్చింది. ఇక మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌కు ఛాన్స్ ఇచ్చింది.
.@INCIndia first list: Former CLP leader and former minister K Jana Reddy’s another son Raghuveer Kunduru finds place. Already,
— Saye Sekhar Angara (@sayesekhar) March 8, 2024
One son Jayaveer is elected from Nagarjunasagar constituency.
Zaheerabad -Suresh Shetkar (ex-MP)
Chevella- Sunitha Mahender Reddy, ZP Chairperson of… pic.twitter.com/QnK18iZjT5
అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన మహబూబ్‌నగర్ అభ్యర్థిని హోల్డ్‌లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. కానీ, తాజా లిస్ట్‌లో ఆయన పేరు హోల్డ్‌లో పెట్టి ఉంచడం హాట్ టాపిక్‌గా మారింది.