Telugu Global
Telangana

సీఈసీని ప్రకటించిన కాంగ్రెస్.. ఉత్తమ్ వర్గం ఫుల్ హ్యాపీ

సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ)కి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) అంత ప్రాధాన్యత ఉంది. ఈ కమిటీ కాలపరిమితి ఐదేళ్లు. ఈలోగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, అభ్యర్థుల ఎంపిక ఈ కమిటీ చేతుల్లోనే ఉంటుంది.

సీఈసీని ప్రకటించిన కాంగ్రెస్.. ఉత్తమ్ వర్గం ఫుల్ హ్యాపీ
X

సార్వత్రిక ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక కమిటీ నియామకం పూర్తయింది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీని తాజాగా ప్రకటించారు. ఈ కమిటీలో 16మంది సభ్యులుంటారు. సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే వంటి కీలక నేతలతోపాటు వివిధ రాష్ట్రాలనుంచి మరో 13మందిని ఎంపిక చేశారు. ఈ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలనుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం విశేషం.


సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ)కి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) అంత ప్రాధాన్యత ఉంది. ఈ కమిటీ కాలపరిమితి ఐదేళ్లు. ఈలోగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, అభ్యర్థుల ఎంపిక ఈ కమిటీ చేతుల్లోనే ఉంటుంది. అలాంటి కీలక కమిటీలో తెలంగాణ నుంచి ఉత్తమ్ కి చోటు దక్కడంతో ఆయన వర్గం ఫుల్ ఖుషీగా ఉంది. సీఈసీలో తెలుగు రాష్ట్రాల నుంచి గత 35 ఏళ్లుగా ఎవరికీ చోటు దక్కలేదని అంటున్నారు, అలాంటి కీలక కమిటీలో ఉత్తమ్ కి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు.

రేవంత్ వర్గానికి చెక్ పెట్టినట్టేనా..?

ఇటీవల గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. ఉత్తమ్ కుటుంబానికి రెండు సీట్ల కేటాయింపు వ్యవహారంలో ఈ రచ్చ జరిగింది. ఇప్పుడు నేరుగా ఉత్తమ్ సీఈసీ మెంబర్ అయ్యారు. అంటే పీసీసీలు ఎన్ని సిఫారసులు చేసినా, చివరకు వాటిని ఫైనల్ చేసే అధికారం సీఈసీకే ఉంటుంది. అలాంటి కమిటిలో ఉత్తమ్ సభ్యుడు. అంటే రేవంత్ వర్గానికి దాదాపుగా చెక్ పెట్టినట్టేనని టీపీసీసీలో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా అధిష్టానం ఈ ఆలోచన చేసిందని కూడా అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో గొడవలు లేకుండా ఒకరిని జాతీయ స్థాయి రాజకీయాల్లోకి తీసుకెళ్తున్నారని, దీంతో టీపీసీసీలో వర్గపోరు తగ్గుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి.

First Published:  5 Sept 2023 1:02 AM GMT
Next Story