అమెరికా H1-B వీసా స్కామ్.. నిందితుల్లో కాంగ్రెస్ నేత!
ఎన్నికల టైమ్‌లో మహిళా ఓటర్లకు కుక్కర్లు పంచడంపై ఆయనపై కేసు నమోదైంది. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ (TV9) రిపోర్టర్‌ను సైతం బెదిరించారని కేసు నమోదైంది.
అమెరికాలో వెలుగులోకి వచ్చిన H1-B వీసా స్కామ్‌లో చిక్కుకున్నారు కాంగ్రెస్ నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కంది శ్రీనివాస్ రెడ్డి. H1-B వీసా రిగ్గింగ్‌కు పాల్పడిన ప్రధాన నిందితుల్లో కంది శ్రీనివాస్ రెడ్డి ఒకరు. ఒకే అభ్యర్థికి దాదాపు 30 సార్లు H1-B వీసా దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.
2022లో ఇండియాకు వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డి.. మొదట్లో బీజేపీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం బీఎల్ సంతోష్ ద్వారా బీజేపీ హైకమాండ్‌తో చర్చలు జరిపారు. అయితే ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇక ఎన్నికల టైమ్‌లో మహిళా ఓటర్లకు కుక్కర్లు పంచడంపై ఆయనపై కేసు నమోదైంది. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ (TV9) రిపోర్టర్‌ను సైతం బెదిరించారని కేసు నమోదైంది.
#Breaking— Congress Candidate from Adilabad assembly constituency Kandi Srinivas Reddy is embroiled in a major visa scam unfolded in the United States. He is one of the top accused for H1B- Visa rigging. Credit @business
— @Coreena Enet Suares (@CoreenaSuares2) August 1, 2024
Who is Kandi Srinivas Reddy?
In Early 2022, suddenly… pic.twitter.com/AdIFX1vIpC
ఇక అమెరికాలో ఉన్న కంది శ్రీనివాస్ రెడ్డి ఐటీ సంస్థ టర్నోవర్ రూ.800 కోట్లని సమాచారం. గతంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించిన మొత్తం ఖర్చు శ్రీనివాస్ రెడ్డి భరించారని తెలుస్తోంది. H1-B వీసా అనేది నాన్ ఇమ్మిగ్రెట్ వీసా. ఈ వీసా అమెరికా కంపెనీలు ప్రత్యేకమైన ఉద్యోగాలలో విదేశీయులను నియమించుకునేందుకు అనుమతి ఇస్తుంది. అయితే కొన్ని కంపెనీలు ఈ వీసాను దుర్వినియోగం చేసినట్లు స్పష్టమైంది.