కోఠి మహిళా యూనివర్సిటీలో విద్యార్థినుల ఆందోళన
కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని యూనివర్సిటీ విద్యార్థినులు ధర్నాకు దిగారు.
కోఠి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని యూజీసీ చేర్చాలని కళాశాలలో విద్యార్ధునులు ఆందోళనకు దిగారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందని తమ డిగ్రీ పూర్తి అవుతున్న ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల తమకు ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్లు ఇస్తారని ఆందోళన విద్యార్ధునులు చేపట్టారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
గుర్తింపు లేని విద్య అన్యాయం" అని, "విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం గుర్తించాలి" అని ఫ్లకార్డులు ప్రదర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది కానీ రేవంత్ సర్కార్ యూజీసీ నుండి మాత్రం విశ్వవిద్యాలయంగా గుర్తింపు మాత్రం సంపాదించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, కోఠి మహిళ విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని విద్యార్ధునులు డిమాండ్ చేశారు.