గచ్చిబౌలి పీఎస్ వద్ద బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
మాజీ మంత్రి హరీశ్‌రావును విడుదల చేయాలంటూ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ దగ్గర బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు.
మాజీ మంత్రి హారీశ్‌రావును విడుదల వెంటనే విడుదల చేయాలని హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న హరీశ్‌రావును ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు కలిశారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, పోలీసులతో హరీశ్‌రావు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత హరీశ్‌రావుతో పాటు కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు. పోలీసుల విధులను అడ్డుకున్నారని.. సీఐని అడ్డగించారంటూ కౌశిక్‌రెడ్డితో పాటు పలువురిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో బుధవారం కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో, హరీష్, జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.