Telugu Global
Telangana

లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

లగచర్ల ఘటనకు బాధ్యులను చేస్తూ పోలీసులు కొందరిని అరెస్ట్‌ చేయడంతో బాధితులు...ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు.

లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు
X

వికారాబాద్ లగచర్ల ఘటనపై బాధిత రైతు కుటుంబాలు ఇవాళ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిశారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో తమపై పోలీసులు జరిపిన దాడి గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు బాధితులు వివరించారు. పార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే తమ వారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, లగచర్ల బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా నిలబడింది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసేందుకు లగచర్ల బాధితుల వెంట ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, ఎంపీ వద్దిరాజు, మాజీ ఎంపీ మాలోతు కవిత, జడ్పీ మాజీ చైర్మన్‌ తుల ఉమ, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు వెళ్లారు.

First Published:  18 Nov 2024 12:29 PM IST
Next Story