Telugu Global
Telangana

మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పీఎస్‌లో మహిళా కార్పొరేటర్ల ఫిర్యాదు

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల ఫిర్యాదు చేశారు. తెలంగాణ సభ్య సమజం తలదించుకునేలా కామెంట్స్ చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు.

మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పీఎస్‌లో మహిళా కార్పొరేటర్ల ఫిర్యాదు
X

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల ఫిర్యాదు చేశారు. తెలంగాణ సభ్య సమజం తలదించుకునేలా కామెంట్స్ చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. కాగా, తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నట్టు తెలిపారు. మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని.. అన్యదా భావించకూడదని ఇప్పటికే ఎక్స్‌ ద్వారా నటి సమంతకు ట్వీట్‌ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. తన శైలిలో ట్వీట్ల వర్షం కురిపించాడు. కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటని ప్రశ్నించిన ఆర్జీవీ.. అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని అని అన్నాడు. మరోవైపు నటి సమంతపై మంత్రి కామెంట్స్‌పై సినీ, రాజకీయ వర్గాల్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి సమంత, నాగార్జునకు పలువురు మద్దతుగా నిలిచారు.

మెగా స్టార్ చిరంజీవి, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, అల్లు అర్జున్ ఖండించారు.తాజాగా ఈ విష‌య‌మై తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ స్పందించింది. స‌మంత‌పై మంత్రి కొండా సురేఖ చేసిన‌ వ్యాఖ్య‌ల‌ను నిశితంగా ప‌రిశీలించిన‌ట్లు క‌మిష‌న్ వెల్ల‌డించింది. స‌మంత‌కు సురేఖ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోయి ఉంటే.. వ్య‌వ‌హారం మ‌రోలా ఉండేద‌ని తెలిపింది. ఈ వ్య‌వ‌హారంలో ఇక త‌మ జోక్యం అవ‌స‌రంలేద‌ని భావిస్తున్న‌ట్లు మ‌హిళా క‌మిష‌న్ పేర్కొంది. ఇక మంత్రికి హిరో నాగార్జున లీగ‌ల్ నోటీసులు ఇచ్చే అంశం పూర్తిగా ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని క‌మిష‌న్ చెప్పుకొచ్చింది. మ‌రోవైపు మాజీ మంత్రి కేటీఆర్ ఇప్ప‌టికే మంత్రి సురేఖ‌కు లీగ‌ల్ నోటీసులు పంపించిన విష‌యం తెలిసిందే.

First Published:  3 Oct 2024 9:51 AM GMT
Next Story